Wednesday, November 2, 2016



కార్తిక  శివకేశవారాధన-03 
శివ కేశవులు ఒకరే,
పేర్లలో తేడాలున్నాయి కాని వారు అనుగ్రహించే ఫలాలలో (ఫలితాలలో) తేడా లేదని అద్భుతంగా శబ్ద చమత్కారంతో వర్ణించిన ఒక ప్రాచీన కవి శ్లోకంఇది

వాసుదేవ ఇతి వామదేవ ఇత్యస్తి కల్పక మహీరుహ ద్వయమ్
 యద్యపీహ సుమభేద సంభవః  నాస్త్యథాపి ఫల భేద సంభవః

ప్రతి పదార్థము

వాసుదేవ ఇతి = వాసుదేవుడని(వసుదేవుని కుమారుడు వాసుదేవుడు. విష్ణువు)
వామదేవ ఇతి = వామదేవుడని(ఎడమపక్క ధరింపబడిన భార్య కలవాడు  వామదేవుడు. శివుడు)
 కల్పక మహీరుహ ద్వయమ్= రెండు  కల్పవృక్షాలు
అస్తి= ఉంది(ఉన్నాయి.)
ఇహ= ఇక్కడ
 యద్యపి= యది+అపి= రెండు వృక్షాలు అయినప్పటికి
సుమభేద సంభవః (అస్తి) = ఆరెండింటి మధ్య సుమ భేదమే ఉన్నది.( పూలలోనే తేడా ఉన్నది.అని ఒక అర్థం.వాసుదేవ లో “సు”- వామదేవ లో “మ” అనే అక్షరాల తేడా నే ఉన్నది.మిగతా అక్షరాలు సమానంగా ఉన్నాయి అని ఇంకొక అర్థం.

తథాపి = అయినప్పటికిని
ఫల భేద సంభవః నాస్తి =ఆరెండు చెట్ల పండ్లలో తేడా లేదని ఒక అర్థం. ఆఇద్దరు దేవుళ్ళు ఇచ్చే  ఫలితాలలో తేడా లేదని ఇంకొక  అర్థం

తాత్పర్యము

వాసుదేవుడని వామదేవుడని రెండు  కల్పవృక్షాలు ఉన్నాయి
రెండు వృక్షాలు అయినప్పటికి ఆరెండింటి మధ్య సుమ భేదమే ఉన్నది. పూలలోనే తేడా ఉన్నది.అని ఒక అర్థం.వాసుదేవ లో “సు”- వామదేవ లో “మ” అనే అక్షరాల తేడా నే ఉన్నది.మిగతా అక్షరాలు సమానంగా ఉన్నాయి అని ఇంకొక అర్థం.
ఆ రెండు  చెట్ల పండ్లలో తేడా లేదని ఒక అర్థం. ఆ ఇద్దరు దేవుళ్ళు ఇచ్చే  ఫలితాలలో తేడా లేదని ఇంకొక  అర్థం








No comments: