Saturday, November 5, 2016





కార్తిక  శివకేశవారాధన-06   06112016

(అప్పయ్యదీక్షితుల  హరిహరాభేదస్తుతి నుండి)

కుధ్రధరముదగ్నిధరం జలధిసుతాకాన్తమగజాకాన్తమ్
గరుడస్థం వృషభస్థం వన్దే పఞ్చాస్త్రమఖిలదిగ్వస్త్రమ్

ప్రతిపదార్థము

కుధ్రధరమ్= కొండను ధరించిన విష్ణువును ( గోవర్ధన పర్వతమును కృష్ణావతారములో ధరించిన ఇతివృత్తం ప్రసిద్ధం.)
ఉదగ్నిధరం=ప్రకాశించే హాలాహలము అను విషాగ్నిని ధరించిన శివుని

 జలధిసుతాకాన్తమ్= సముద్రపు కుమార్తె అయిన లక్ష్మీదేవికి ఇష్టమైన విష్ణువుని

అగజాకాన్తమ్= హిమవత్పర్వతపు కుమార్తె అయిన పార్వతికి ఇష్టమైన శివుని

గరుడస్థం-= గరుడ పక్షి వాహనముగా గల విష్ణువుని

 వృషభస్థం = నంది వాహనముగా గల శివుని

పఞ్చాస్త్రమ్= అయిదు బాణములు కలిగిన మన్మథుని కుమారునిగా కల విష్ణువుని

అఖిలదిగ్వస్త్రమ్ = అన్ని దిక్కులు వస్త్రములుగా గల శివుని

వన్దే= నమస్కరించుచున్నాను.

తాత్పర్యము

కొండను ధరించిన విష్ణువును

ప్రకాశించే హాలాహలము అను విషాగ్నిని ధరించిన శివుని

 సముద్రపు కుమార్తె అయిన లక్ష్మీదేవికి ఇష్టమైన విష్ణువుని

హిమవత్పర్వతపు కుమార్తె అయిన పార్వతికి ఇష్టమైన శివుని

గరుడ పక్షి వాహనముగా గల విష్ణువుని

నంది వాహనముగా గల శివుని

అయిదు బాణములు కలిగిన మన్మథుని కుమారునిగా కల విష్ణువుని

అన్ని దిక్కులు వస్త్రములుగా గల శివునికి నమస్కరించుచున్నాను.

విశేషాలు

మన్మథుని బాణములు మోదనము, ఉన్మాదనము, సంతాపనము, శోషణము, నిశ్చేష్టాకరణము అనునవి. 
అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలము అనునవి అయిదు మన్మథుని బాణములు అనియు అందురు.

No comments: