Friday, November 4, 2016




కార్తిక  శివకేశవారాధన-05
(అప్పయ్యదీక్షితుల  హరిహరాభేదస్తుతి నుండి)

కృష్ణతనుముమార్ధతనుం
శ్వశురగృహస్థం సుమేరుశృఙ్గస్థమ్
దశవపుషం వసువపుషం
వన్దే భూజానిమఖిలభూపాలమ్

ప్రతిపదార్థము

కృష్ణతనుమ్= నల్లని శరీరము కలిగిన విష్ణువుని
ఉమార్ధతనుం = పార్వతీదేవిని సగము శరీరముగా కలిగిన శివుని
శ్వశురగృహస్థం= ఎప్పుడూ మామగారయిన సముద్రుని ఇంట్లో ఉండు విష్ణువుని
 సుమేరుశృఙ్గస్థమ్ =మేరు పర్వతపు  కొమ్ముల యందు ఉండు శివుని
దశవపుషం = దశావతారముల శరీరములు కలిగిన విష్ణువుని
వసువపుషం = భూమిని తన అష్ట శరీరములలో ఒకనిగా కల శివుని
భూజానిమ్= రాజు అయిన విష్ణువుని (భూమికి భర్త అయిన విష్ణువుని)  
అఖిలభూపాలమ్ = సమస్త భూమిని పాలించు రాజు అయిన శివుని/అఖిల రాజులను పాలించువానిని
వన్దే= నమస్కరించుచున్నాను.

తాత్పర్యము

నల్లని శరీరము కలిగిన విష్ణువుని, పార్వతీదేవిని సగము శరీరముగా కలిగిన శివుని
ఎప్పుడూ మామగారయిన సముద్రుని ఇంట్లో ఉండు విష్ణువుని,మేరు పర్వతపు  కొమ్ముల యందు ఉండు శివుని
దశావతారముల శరీరములు కలిగిన విష్ణువుని, భూమిని తన అష్టమూర్తులలో ఒకనిగా కల శివుని
రాజు అయిన విష్ణువుని (భూమికి భర్త అయిన విష్ణువుని)  సమస్త భూమిని పాలించు రాజు అయిన శివుని
నమస్కరించుచున్నాను.

విశేషాలు

బాల రామునికి జోలలు పాడే సందర్బంలో  విశ్వ నాథ పోతన్నని కలుపుకొని భూజాని పదానికి కొత్త పీట ఇలా వేసారు
జోజో కమలదలేక్షణ
జోజో మృగరాజమధ్య జోజో కృష్ణా
శ్రీజేతృదిలీపాన్వయ

భూజాని లతాగ్రభాసి పూవా జోజో (శ్రీరామాయణకల్పవృక్షము, బాల 296)

No comments: