Thursday, November 10, 2016


కార్తిక  శివకేశవారాధన-11 వ భాగము 11112016

(అప్పయ్యదీక్షితుల  హరిహరాభేదస్తుతి నుండి)

వస్తాం పిశఙ్గం వసనం దిశో వా
గరుత్మతా యాతు కకుద్మతా వా।
నిద్రాతు వా నృత్యతు వాఽధిరఙ్గే
భేదో న మే స్యాత్పరమస్య ధామ్నః

రాగిరంగుకలిగిన వస్త్రములు ధరించి(పిశంగం) పీతాంబరధారిగా , గరుడవాహనునిగా  కనబడితే ఆ దేవుడిని  హరి అనిపిలుస్తాం.

 దిగంబరునిగా , గొప్ప మూపురము గల ఎద్దుని ఎక్కి  నంది వాహనుడై కనపడితే ఆ  పరమాత్మ హరుడు.

పాలసముదంలో  శయనించి కనబడితే  హరి. 
నృత్యభంగిమలో కనబడితే నటరాజు.

ఒకే శక్తి రెండు రూపాలలో ఉంది.

ఆరెండింటి మధ్య తేడా నాకు కనబడుట లేదు.


రెండుగా కనబడే ఒకే  శక్తికి  నమస్కారము

No comments: