Sunday, November 6, 2016

కార్తిక  శివకేశవారాధన-07   07112016

(అప్పయ్యదీక్షితుల  హరిహరాభేదస్తుతి నుండి)
బ్రహ్మసుత మృగాతినుతం గజగిరివాసం గజేన్ద్రచర్మాఙ్గమ్
సురశరణం హరిశరణం వన్దే భూదారమఖిలభూదారమ్


బ్రహ్మసుతమ్             = బ్రహ్మ కుమారునిగా కలవానిని
ఋగాతినుతం                =ఋగ్వేదము మొదలైన వాటిచే  కొనియాడబడినవానిని
గజగిరివాసం                  = పెద్దదయిన కొండ భద్రాచలము నివాసముగా కలవానిని
గజేన్ద్రచర్మాఙ్గమ్           = గజాసురుని చర్మము శరీరముపై ధరించినవానిని
సురశరణం                    = దేవతలచే శరణము పొందినవానిని
హరిశరణం                 = విష్ణువుచే కొనియాడబడినవానిని
భూదారమ్                = వరాహావతారము ధరించినవానిని
అఖిలభూదారమ్           = అఖిలరాజుల నమస్కారములందుకొనువానిని
వన్దే                               = నమస్కరించుచున్నాను.

తాత్పర్యము

బ్రహ్మ కుమారునిగా కలవానిని
ఋగ్వేదము మొదలైన వాటిచే  కొనియాడబడినవానిని
పెద్దదయిన కొండ భద్రాచలము నివాసముగా కలవానిని
గజాసురుని చర్మము శరీరముపై ధరించినవానిని
దేవతలచే శరణము పొందినవానిని
విష్ణువుచే కొనియాడబడినవానిని
వరాహావతారము ధరించినవానిని
అఖిలరాజుల నమస్కారములందుకొనువానిని
విష్ణువు, శివులను వరుసగా నమస్కరించుచున్నాను.

విశేషాలు

ఋగాతినుతం

 వేదము చేత ధర్మాధర్మముల నెరుగుదురు. వేదాలను తొలిచదువులు అంటారు.  ఇవి నాల్గు- ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము. ప్రాచీన భారత ఆర్య (ఇండో-ఇరానియనుల) ధర్మ గ్రంథములు.
(ఋక్వేదము:- 1017 వేదమంత్రములసంహితము, వేదము లన్నిటిలోను పురాతనమైనది, ఋక్వేదమంత్రములకు పారశీక (ఇరానియనుల ధర్మగ్రంథమయిన) ధ్యానశ్లోకములకు సన్నిహిత సంబంధము గలదు.
సామవేదము:-వేదమంత్రములకు స్వరములు కల్పించి గానరూపమును చూపు సంహిత.
 యజుర్వేదము: - వైదిక తంత్రములను గురించి చెప్పు సంహిత. అధర్వణవేదము:-వేదసంహితలలో చివరిది. సంహిత భూత ప్రేత మంత్రములతోను చారిత్రక విషయములతోను కూడి యున్నది.
కవి ఈ శ్లొకములో ఋక్వేద ప్రస్తావన చేసారు.

గజగిరివాసం

పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీమహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహం తో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందుతారు.
ఒకడేమో భద్రుడు, ఇంకొకడు రత్నకుడు.
 భద్రుడు విష్ణుమూర్తిని గురించి తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తి కి నివాస స్థానమైన భద్రాచలం గా మారుతాడు.
 రత్నకుడు అనే ఇంకో కొడుకు కూడా విష్ణువు గురించి తపమాచరించి మెప్పించి మహావిష్ణువు శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి గా వెలసే రత్నగిరి, లేదా రత్నాచలం కొండగా మారుతాడు.


No comments: