Monday, October 10, 2016

పదకొండవ రోజు (11-10-2016) కనకదుర్గమ్మకు   రాజరాజేశ్వరీదేవి    అలంకరణ
                    ధ్యాన శ్లోకము  - తాత్పర్య విశేషాలు
1.1.కల్యాణాయుత పూర్ణ చంద్రవదనాంప్రాణేశ్వరానందినీం
1.2.పూర్ణం పూర్ణతరాం పరేశమహిషీంపూర్ణామృతాస్వాదీనీం
1.3.సంపూర్ణాం పరమోత్తమామృతకళాం విద్యావతీంభారతీం
1.4.శ్రీచక్ర ప్రియబిందు తర్పణ పరాం శ్రీ రాజరాజేశ్వరీం||
తాత్పర్యము
1,1.ఆమె అన్ని మంచి లక్షణాల నిలయం.ఆమె ముఖం మెరుస్తూ పున్నమ చంద్రుని పోలి ఉంటుంది,ఆమె తన ప్రాణేశ్వరుడైన శివునికి ఆనందం కలిగిస్తుంది.
1.2.ఆమె పూర్ణమైనది.పూర్ణతరమైనది.శివుని దేవేరి ,ఆమె అమృతాన్ని ఆస్వాదిస్తుంది.
1.3.ఆమె సంపూర్ణురాలు.ఆమె ఉత్తమమైన అమృత కళ.ఆమె సరస్వతి .జ్ఞాన దేవత.
1.4. శ్రీచక్రారాధనతో  సంతోషపడే   రాజరాజేశ్వరీదేవికి  నమస్సులు.

విశేషాలు
శ్రీ చక్రంలో సమస్తమూలాలు, మూలకాలు, మహిమాన్వితులైన దేవతలు, మంత్రోచ్ఛారణలు, కేంద్రంలో ఒక బిందువు వున్నాయి.
ఆ కేంద్రంలో వున్న బిందువు, విచ్చుకుని మొలకెత్తేందుకు సిద్ధంగా వున్న విత్తనాన్ని సూచిస్తుంది.
తనలో నుండి కొత్తశక్తి ఇవ్వగలటాన్ని తెలియజేయడం ఆ బిందువు యొక్క ఉద్దేశం.
సృష్టికి ముందు సత్ అనే చిదగ్నిగా భావింపబడే బ్రహ్మ పదార్ధము వున్నది.
అది మహాబిందువు. అది అనేకముగా అగుదును అని సంకల్పించి మహాకారణ రూపమైంది. ( చాందోగ్యోపనిషత్తు)
శ్రీ చక్రములో ఉన్న ఆ బిందువు యొక్క ఆరాధన ద్వార తృప్తిని పొందే పరదేవత శ్రీ రాజరాజేశ్వరీ దేవికి నమస్సులు.




                 

No comments: