Saturday, October 8, 2016

తొమ్మిదో రోజు (09-10-2016) కనకదుర్గమ్మకు   దుర్గతులు తొలగించే  దుర్గమ్మ అలంకరణ

                సందర్భంగా      దుర్గా సూక్తము తాత్పర్య వివరణములతో

                                                                1
ఓం జాతవేదసే సునవామ సోమ మరాతీయతే నిదహాతి వేదః  
నః పర్షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిః  1
తాత్పర్యము
1.1.జాత వేదుడగు అగ్ని కొరకు  యాగకాలములో ఉపయోగించే సోమలతను  అభిషుతము(రసము తీసిన సోమము- రసము తీసిన సోమలతగాచేస్తున్నాము. అగ్ని మాయందు శత్రుత్వమును చేయదలచిన పురుషులను కాల్చివేయుగాక !
1.2. అగ్ని మాయొక్క అపదలన్నింటిని నావ చేత సముద్రమువలె నాశనము చేయును. (సముద్రములో మునుగకుండా  నావ దాటించినట్లు ఆగ్ని కష్టాలనుండి దాటించాలని భాఅవం)  అగ్నిహోత్రుడు మాపాపములను నశింపచేయుగాక !
విశేషాలు
జాతవేదుడు
అపౌరుషేయాలైన (అసామాన్యశక్తికలిగిన-not of human but of divine origin)  వేదాల పుట్టుకను గురించి అగ్ని ఒక్కరికే తెలుసు. వేదాల పుట్టుక గురించి తెలిసినవాడు కనుక అగ్ని జాతవేదుడు అని పిలువబడ్డాడు.
వేదములో ఒక విషయమును గురించిన కొన్ని పనసలను సూక్తము అంటారు.
ప్రతి పనసలోనూ ఏబది పదాలు ఉంటాయి. అనువాకాంత పనసల లోనూ, చిన్న పనసలు కొన్నింటి లోనూ స్వల్పంగా ఎక్కువ తక్కువలు ఉండవచ్చు.

                                                                2
తామగ్నివర్ణాం తపసా జ్వలన్తీం వైరోచనీంకర్మఫలేషు జుష్టామ్ |
దుర్గాం దేవిగ్ం శరణమహంప్రపద్యే సుతరసి తరసే నమః
తాత్పర్యము
2.1.అగ్నితో సమానమైన రంగు  కలదీ, తన కాంతి చేత మా శత్రువులను నశింప చేయునది ,పరమాత్మకు చెందినదీ, కర్మ ఫలముల నిమిత్తమై శక్తిగా వెలసిన
2.2.దుర్గాదేవిని నేను శరణు జొచ్చుచున్నాను. సంసార సాగరం నుండి అవతలి  తీరానికి చేరుటకు ప్రధాన కారణమయిన  దుర్గాదేవీ! నీకొరకు  నమస్కారము.
విశేషాలు
వైరోచని
స్వయముగా ప్రకాశించు పరమాత్మ వైరోచని.
ఒక్క మంత్రములొనే  -దుర్గా సూక్తములో - దుర్గాదేవి సంబోధించబడినది. మిగతా అన్నిచోట్ల అగ్ని పదము- దుర్గమ్మకు ప్రతీకాత్మకంగా ప్రయోగించబడింది.
కష్టముచే ఎరుగదగినది కనుక  దుర్గ అని పేరు వచ్చింది.(దుఃఖేన గంతుంశక్యతే  దుర్గా)
వనము మొద్లైన దుర్గము స్థానముగా కలది దుర్గ
                                                                                                3
అగ్నే త్వం పారయా నవ్యో అస్మాంథ్స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా
పూశ్చ పృథ్వీ బహులా ఉర్వీ భవా తోకాయ తనయాయ శంయోః
తాత్పర్యము
3.1. అగ్నిదేవా! కొనియాడదగిన నువ్వు మమ్మలిని క్షేమకరములగు ఉపాయములచేత సమస్తమైన ఆపదలనుండి  దాటింపుము.
3.2.మా యొక్క నివాస భూతమగు పట్టణము  విశాలమైనదిగా(విశాలమైన ఉత్తమమైన మనస్సులు కలిగినదిగా) అగుగాక ! భూమి అధికమైనదిగా(మంచివారు ఎక్కువగా ఉండునట్లు)  అగుగాక ! అగ్నిదేవా!  పుత్రులకు, వారి   పుత్రులకు సుఖములు కలుగజేసేవానిగా  నువ్వు  కమ్ము.!
                                                                4
విశ్వాని నో దుర్గహా జాతవేదః సింధుం  నానా దురితాతిపర్షి
అగ్నే అత్రివన్మనసాగృణానోస్మాకం బోధ్యవితా తనూనామ్
తాత్పర్యము
4.1.అగ్నిదేవా! ఓడ చేత సముద్రమును వలె   మా పాపములన్నింటిని తరింపచేయుము.
4.2. అగ్నీ ! అత్రి మహర్షి వలె  నువ్వు మనస్సు చేతను  పలుకుచున్నాడవై మా యొక్క శరీరములకు రక్షకుడిలా తెలుసుకొనుము.(నువ్వు అత్రివంటి వాడివని భావము)
విశేషాలు
అద (=భక్షణే) + త్రిన్. (కృ.ప్ర.) పాపములనెల్ల గ్రసించువాఁడు.(మింగువాడు) కనుక అత్రి అని పేరు వచ్చింది.
అత్రి మహర్షి నిరంతరము లోక క్షేమాన్ని కోరుకొంటాడు. ఆధ్యాత్మికాది తాపత్రయాలు లేనివాడు
దైవ సంబంధమైనది ఆధి దైవికమనీ, పంచ భూతాలకు సంబంధించినది ఆధి భౌతికమనీ, ఆత్మ తత్త్వసంబంధమైనది ఆధ్యాత్మికమనీ రూఢి. ( పదాలలో ఆధి శబ్దానికి మానసికమైన అనే అర్థం లేదు.) మూడింటిని తాపత్రయం అన్నారు
అత్రి మంత్రద్రష్టయైన మహర్షి.
మరీచి, అత్రి, అంగిరుఁడు, భరద్వాజుఁడు, పులస్త్యుఁడు (పులహుఁడు), క్రతువు, వశిష్ఠుఁడు - అను సప్తర్షులలో ఒకడు అత్రి ఋషిభార్య అనసూయ
తన తపోబలముచే త్రిమూర్తుల యంశములందు సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కుమారులుగ పొందినవాడు.
                                                                5
పృతనా  జితగ్ం సహమానముగ్రమగ్నిగ్ం  హువేమ పరమాత్సధస్థాత్
నః పర్షదతి దుర్గాణి విశ్వా క్షా మద్దేవోతి దురితాత్యగ్నిః
తాత్పర్యము
6.1.శత్రు సైన్యములను జయించునట్టిదియూ,శత్రువులను తిరస్కరించున్నట్టియూ మరియూ భయకారణమైన అగ్నిని   తన సేవకులతో కూర్చుని ఉన్న స్థానమునుండి ఆహ్వానించుచున్నాము.
6.2.   అగ్ని  మా యొక్క ఆపదలన్నింటిని బాగా నశింపచేయుగాక ! అగ్ని మా అపరాధములను క్షమించుచూ ఎక్కువైన  దాటనలవికాని మా పాపములను  దాటించుగాక !(అనగా ఘోర పాపములనుండి రక్షించాలని భావము.)
                                                                7
ప్రత్నోషి కమీడ్యో అధ్వరేషు/ సనాచ్చ హోతా నవ్యశ్చ సత్సి
స్వాంచాగ్నే తనువం పిప్రయస్వాస్మభ్యం సౌభగమాయజస్వ
తాత్పర్యము
7.1.         అగ్నిదేవా! యాగములందు కొనియాడబడుతున్నవాడివై సుఖాన్ని విస్తరింపచేస్తున్నావు. కర్మ ఫలములను  ఇచ్చు
                వాడవయ్యును  హోమ నిష్పాదకుడవై,(పుట్టిన వాడివై) స్తుతికి అర్హుడవై యాగ ప్రదేశములో ఉన్నావు.
7.2.         అగ్నిదేవా! నీ శరీరమును నేను ఇచ్చు  హవిస్సు(వేల్చుటకు ఇగురబెట్టిన అన్నము, నెయ్యి)) చేత నిండించుకొనుము.    మాకొరకు ఐశ్వర్యమును, శుభమును అంతటా ఇమ్ము.

                                                                8.
గోభిర్జుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోరనుసంచరేమ
నాకస్య పృష్ఠమభి సంవసానో వైష్ణవీం లోక ఇహ మాదయంతాం
తాత్పర్యము
8.1. ఇంద్రుడా ! మేము గోవుల చేత సేవింపబడునట్టియూ , అమృత ధారల చేత తడుపబడిన   పాపములచేత , దుఃఖములచేత కూడుకొనబడిన సరవ్యాపకుడివైన  నిన్ను  సేవకులవలె అనుసరింతుము.
 8.2.స్వర్గము యొక్క పై భాగమునందు నివసించుచున్న  దేవతలందరూ  విష్ణు భక్తిగల నిన్ను భూలోకమునండు కోరిన కోరికలు ఇచ్చి సంతోషింపచేయుదురు గాక!
విశేషాలు
సూక్తములో  మంత్రములో  దుర్గకు బదులుగా ఇంద్ర పదము వాడబడింది.
“అన్నీ ఆమె. అంతా ఆమె” అను భావన ఉంటే  అగ్ని, ఇంద్రుడు అను సంబోధనల తికమక ఉండదు.

                                                                                స్వస్తి.

No comments: