Friday, October 7, 2016

ఎనిమిదోరోజు (08-10-2016) కనకదుర్గమ్మ అలంకరణ సరస్వతీదేవి
                    ధ్యాన శ్లోకము అర్థ తాత్పర్య వివరణములతో

విమలపటీ1 కమలకుటీ2 పుస్తక5-రుద్రాక్ష6-శస్త7-హస్త-పుటీ8
 కామాక్షి3 ! పక్ష్మలాక్షీ4  కలితవిపంచీ9 త్వమేవ వైరించీ10

                                                            (మూక పంచశతి. ఆర్యాశతకము. 92వశ్లోకం)

తాత్పర్యము

1.స్వచ్ఛమైన వస్త్రమును ధరించి
2.కమలమును సభాగృహముగా( ఆసనముగా) చేసుకొని,
3. రెండు  శక్తులు కలిగిన కామాక్షివి నువ్వు.
4. వెడల్పయిన రెప్పవెండ్రుకలున్న కన్నులు కలదానివి.
5.చేతులలో పుస్తకము,
6.రుద్రాక్ష మాలను ధరించి
7.  స్తుతింపబడిన
8. చేతులను పూలబుట్ట కలదానివి
9.కచ్ఛపి అను పేరు గల వీణను ధరించినదానివి.
10.బ్రహ్మ దేవుని ఇల్లాలివి నువ్వే తల్లీ ! నీకు నమస్కారము.

విశేషాలు

  1. పటీ
          దేహమును కప్పు మంచి కోకకు పటమని పేరు.పటయతి దేహం పటః .  పట గ్రంథే గ్రంథో వేష్టనం
  1. కుటీ
          వక్రమగునది  కనుక సభాగృహమునకు కుటీ అని పేరు.కుటతి కుటిలీభవతీతి కుటీ. కుట కౌటిల్యే
  1. కామాక్షి
                "" అంటే బ్రాహ్మీ శక్తి ఆయిన సరస్వతి దేవి . "" అంటే లక్ష్మి దేవి . రెండు శక్తులు కన్నులు గా గలది కామాక్షి
          ఇక్కడఒక చమత్కారము.
                . అమ్మకు కుడివైపున సరస్వతీ దేవి ,ఎడమవైపున లక్ష్మీదేవి ఉండి చామరములు(వింజామరలలు) వీస్తుంటారు
                కనుక అమ్మకు కుడివైపుగా నమస్కరిస్తే  సరస్వతీమాత  వీ చేచామరం గాలి వస్తుందట. [సరస్వతీ కటాక్షం]
          కొంచెం ఎడమవైపుకు నమస్కరిస్తే [లక్ష్మీ కటాక్షం ]మనమీద  ప్రసరిస్తాయి .
                అలాకాకుండా  అమ్మ రెండు పాదాలకు తల వంచి నమస్కరిస్తే చాలు.
          లక్ష్మీ సరస్వతులే కాక  అమ్మ సంపూర్ణమైన దయ వస్తుంది..
  1. పక్ష్మన్
          పక్ష్యత ఇతి పక్ష్మ. పక్ష పరిగ్రహే. పరిగ్రహింపబడునది కనుక రెప్పవెండ్రుకకు పక్ష్మము అని పేరు
  1. రుద్రాక్ష
          రుద్రునిఅక్షుల నుండి జారిన  నీటి బిందువులు భూమిపై జారి రుద్రాక్ష  మొక్కలుగా మారినవని అంటారు.   రుద్రాక్ష చెట్టుకు కాసే కాయలు రుద్రాక్షలు. వీటికి సాధారణంగా ఒకటి నుంచి పదహారు ముఖాలు ఉంటాయి. ఇంకా ఎక్కువ ముఖాలవి కూడా ఉండవచ్చు. ఎక్కువగా పంచముఖి రుద్రాక్షలే లభిస్తుంటాయి. నేపాల్దేశంలోనూ, బీహార్ఉత్తర ప్రాంతంలోనూ రుద్రాక్ష చెట్లు ఉంటాయి. దక్షిణ దేశంలోనూ ఇరవై ఒకటవ శతాబ్దంలో రుద్రాక్ష చెట్ల పెంపకం జరుగుతున్నది. రుద్రాక్ష మాలలు శివ సంబంధమైన జపాలకు శ్రేష్ఠం అంటారు. రుద్రాక్షలకు ఓషధీ లక్షణాలు ఉన్నాయని ఆధునిక పరిశోధకులు సైతం అంటున్నారు. ఏక ముఖి రుద్రాక్షలకు విలువ మెండు. రుద్రాక్ష పరిమాణాన్ని బట్టి రెండు వరుసలుగానో, ఒక వరుసగానో రుద్రాక్ష మాలలు వేసుకొంటారు. ముంజేతులకు, బాహుదండాలకు, మెడలోనూ, శిరస్సువిూద రుద్రాక్ష మాలలు ధరించే సంప్రదాయం ఉంది. (రుద్రాక్ష విూద నిలువు గీతలు ఉంటాయి. రెండు గీతల మధ్య ఉండే చోటు ముఖం.)
                రుద్రునిఅక్షుల నుండి జారిన  నీటి బిందువులు భూమిపై జారి రుద్రాక్ష  మొక్కలుగా మారినవని అంటారు.
  1. కచ్ఛపి
          కచ్ఛం పాతీతి కచ్ఛపీ. పా రక్శహ్ణే. జల ప్రాయ భూమిని రక్షించునది.
  1. వైరించి
          భూతములను సృజించువాడు విరించి . విశబ్దము పక్షి  వాచకము కనుక హంసల చేత వహింపబడువాడు విరించి.
          విరించి రాణి కనుక  సరస్వతీదేవి వైరించి.
                                                                                                 స్వస్తి.

No comments: