Monday, October 10, 2016

పదవ రోజు (10-10-2016) కనకదుర్గమ్మకు   మహిషాసుర మర్దిని   అలంకరణ
ధ్యాన శ్లోకము
1.1.మహిషమస్తక నృత్తవినోదిని,
1.2.స్ఫుటరణన్మణి నూపుర మేఖలా
1.3.జననరక్షణ మోక్షవిధాయినీ,
1.4.జయతి శుంభనిశుంభ నిషూదినీ
తాత్పర్యము
1.1.ఖండించిన  మహిషుని   శిరస్సుతో చేసే నృత్యపు వినోదము కలదానా !
1.2.. స్పష్టమయిన మ్రోతగల   మణుల  గజ్జెలతో ప్రకాశించు   వడ్డాణము కలదానా !
1.3.సృష్టి, స్థితి, లయములను (మోక్షము) విధించుదానా!
1.4.శుంభ నిశుంభులను సంహరించినదానా !   నీకు జయము.
విశేషాలు
  1. మస్తకము
          మస్యతి కఠినత్వేన పరిణమతి మస్తః  మస్త ఏవ మస్తకః . మస పరిణామే. కఠినమౌట చేత పరిణమించునది మస్తకము
  1. శుంభ నిశుంభులు
          హిరణ్యకశిపు వంశములో పుట్టిన  సుందోపసుందులయొక్క కొడుకులు.
                 వీరు పుష్కర క్షేత్రమున బ్రహ్మనుఁగూర్చి ఉగ్రతపము చేసారు.
          ఇంద్రాదిదేవతలను అవమానించే  శక్తిని పొందారు..
          వీరు గౌరీకాయకోశమునుండి  పుట్టిన కౌశికీదేవిచే చంపఁబడ్డారు.
  1. మహిషాసురమర్దిని
          ఇది  అమ్మ యొక్క  మహోగ్రరూపంగా భావిస్తారు.
          అమ్మ మహిషాసురుడిని చంపిన  అశ్వయుజ శుద్ధ నవమినిమహర్నవమిగా జరుపుకుంటాము.
                 సింహవాహనాన్ని ఎక్కి  ఆయుధాలను ధరించిన చండీదేవి సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా   ఈరోజు                 దర్శనమిస్తుంది
  1. ప్రతీకాత్మకత
          మిగతా జీవులనుండి మనన్ని ప్రత్యేకించి చూపించే ముఖ్యమైన విషయం దేవి మహిషాసురుణ్ణి మర్దించే రూపకల్పనలో అందంగా చిత్రించబడింది. సాంప్రదాయికంగా సగం మనిషీ, సగం దున్నపోతుగా చిత్రించబడ్డ మహిషాసురుడు, మనిషిలోని పశుత్వాన్ని సూచిస్తుంది. పరిణామక్రమం కారణంగా రోజు ఇలా ఉన్న మనలో, ఇంకా అమీబాకీ, వానపాముకీ, మిడతకీ, దున్నపోతుకీ, ఇలా అన్ని పశువులకీ చెందిన కొన్ని లక్షణాలు మిగిలి ఉన్నాయి. ఇవన్నీ తప్పించుకోలేని లక్షణాలు. ఆధునిక నాడీ శాస్త్రం మన మెదడులో కొంతభాగం ఇప్పటికీ సరీసృపానికి చెందినదిగా గుర్తిస్తుందిసరీసృపపు మెదడు పరిణామక్రమంలో అంతఃప్రేరణ ప్రబలంగా ఉన్నప్పటి సమయాన్ని సూచిస్తుంది.
          దేవి మహిషాసురుణ్ణి మర్దించడంలొని ప్రతీకాత్మత  మనిషిలోని మృగస్వభావాన్ని అణచడంఅంటే మీరు పూర్తిగా వికసించిన పద్మం అవుతున్నారన్నమాట. మీకు మీ సరీసృప మెదడుని మేల్కొలిపే అవకాశం ఉంది. లేకపోతే, దేవి మిమ్మల్ని అణిచివేస్తుంది.
          దాని మరోప్రతీకాత్మత, అంతః చేతనతో బ్రతకడం, పుంసత్వపు సహజలక్షణమని  సూచించడం. దానర్థం, సరీసృపపు మెదడు గట్టిగా బిగించిన పిడికిలి లాంటిది. స్త్రీత్వం లోన ప్రవేసిస్తే అది వికసిస్తుంది. అది వికసించినపుడు పుంసత్వం లేదా  పశుస్వభావం దాని పాదాల చెంత దాసోహమంటుంది. దేవీ- మహిషాసురుల ప్రతీకాత్మత సరిగ్గా అదేఆవిడలోని సంపూర్ణమైన శక్తి ఉప్పొంగిందిమహిషాసురుడనే పశుస్వభావం అణచబడింది.(సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రసంగం)
                                                                                                స్వస్తి


1 comment:

సో మా ర్క said...

మహిషాసుర మర్దినిని చక్కగా విశ్లేషించారు.చక్కని చిక్కని వివరణ.మీకు నా అభినందనలు.